ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 1, 2019, 6:18 AM IST

ETV Bharat / city

గ్రామ సచివాలయం... పౌర సేవకు సన్నద్ధం

ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ఉద్దేశించిన గ్రామ, వార్డు సచివాలయాలు... రేపటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కరపలో మొదలు కానున్న మొదటి గ్రామ సచివాలయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యాలయాల్లో గ్రామ వాలంటీర్ల సేవలూ అందుబాటులో ఉంటాయి.

గ్రామ సచివాలయం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తోన్న గ్రామ, వార్డు సచివాలయాలు రేపటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే లక్షా 26 వేల 728 మంది నియామకం దాదాపు పూర్తి కాగా... వీరు శిక్షణ అనంతరం విధుల్లో చేరనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 వేల 944 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో 11 వేల 118 గ్రామ సచివాలయాలైతే... 3,786 వార్డు సచివాలయాలు.

కరపలో ప్రారంభించనున్న సీఎం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కరప పంచాయతీలో... తొలి గ్రామ సచివాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం ప్రతీ మండలంలోనూ... మొదటగా ఒక గ్రామసచివాలయం ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. ఒక్కో గ్రామ సచివాలయంలో 11 మంది సిబ్బంది సేవలందిస్తారు.

వాలంటీర్లు అనుసంధానం

3 లక్షలకు పైగా వాలంటీర్లు కూడా గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా పనిచేయనున్నారు. 95వేల 88 మంది గ్రామ సచివాలయాల్లోనూ... 31 వేల 640 మంది పట్టణ ప్రాంతాల్లోని వార్డు సచివాలయాల్లోనూ వేర్వేరు విభాగాల్లో సేవలందిస్తారు.

గ్రామ సచివాలయం... పౌర సేవకు సన్నద్ధం

ఇదీ చూడండి:

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details