శ్రీశైలం ప్రాజెక్టు వద్ద భూగర్భ హైడల్ పవర్ హౌస్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిన ప్రమాదం కారణంగా తొమ్మిది మంది ఉద్యోగులు మరణించగా, 15 మందిని రక్షించారని తెలిపారు. పవర్‌హౌస్ లోపల చిక్కుకున్న తొమ్మిది మంది ఉద్యోగులను రక్షించడం సాధ్యం కాని పరిస్థితిలో వారు మృతి చెందటం పట్ల గవర్నర్ విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది ఉద్యోగులు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ తన సంతాపం తెలిపారు.
తీవ్రంగా కలచివేసింది : సీఎం జగన్