ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల బ్యాగు మోత తగ్గించేందుకు, ఒత్తిడి నివారణకు... ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త విధానంలో విద్యా సంవత్సరాన్ని 3 విడతలుగా విభజించి, పుస్తకాలను రూపొందిస్తారు. ఒక్కో సబ్జెట్‌కు 3 పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు ఇస్తారు. భాషలకు సంబంధించి ఒకే మాధ్యమంలో, ఇతర సబ్జెక్ట్‌లకు రెండు మాధ్యమాల్లో పాఠాలు ఉంటాయి. ప్రతి పుస్తకానికి ఒక వర్క్‌బుక్ ఉంటుంది. విద్యార్థులు వీటిలోనే తరగతి, హోంవర్కులకు సమాధానాలు రాయాలి. మొదటి విడత ముగింపులో విద్యార్థులు అప్పటివరకు నేర్చుకున్న పాఠ్యాంశాలపై పరీక్ష ఉంటుంది. రెండో విడతలో మొదటి విడత నుంచి 20శాతం, ప్రస్తుత పాఠ్యాంశాల నుంచి 80శాతం ప్రశ్నలుంటాయి. మూడో విడతలో మొదటి , రెండు విడతల పాఠ్యాంశాల నుంచి 10 శాతం చొప్పున, ప్రస్తుత పాఠాల నుంచి 80 శాతం ప్రశ్నలు ఇస్తారు.
ఒకే పుస్తకంలో తెలుగు, ఆంగ్లం