విశ్రాంత ఐఏఎస్ అధికారిణి ప్రీతి సూదాన్పై క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2005- 2006 సంవత్సరంలో వ్యక్తిగత సెలవులను దుర్వినియోగం చేయటంపై క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు. స్టడీ టూర్ పేరిట ఆమె తన కుటుంబంతో గడిపేందుకు అమెరికా వెళ్లారని నిర్ధారణ కావటంతో వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రెండు వారాల్లోగా తన వివరణను సమర్పించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏపీ కేడర్ నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్లిన ప్రీతీ సూదాన్... గత ఏడాది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యదర్శిగా ఉద్యోగ విరమణ చేశారు.
విశ్రాంత ఐఏఎస్ ప్రీతి సూదాన్పై క్రమ శిక్షణా చర్యలు - disciplinary action against the reatired ias preethi sudan
విశ్రాంత ఐఏఎస్ అధికారిణి ప్రీతి సూదాన్పై క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగత సెలవులను దుర్వినియోగం చేయటంపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
విశ్రాంత ఐఏఎస్ ప్రీతి సూదాన్