ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయం..ఎప్పుడంటే..! - ap govt looks on rtc bus services news

వలస కార్మికుల తరలింపు పూర్తయ్యాక బస్సు సర్వీసులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిచింది.దీనిపై 3,4 రోజుల్లో అధికారికంగా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

rtc
rtc

By

Published : May 18, 2020, 4:01 PM IST

Updated : May 18, 2020, 4:19 PM IST

బస్సులు నడిపే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్రం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలపై సమావేశంలో చర్చిస్తోంది. వలస కార్మికుల తరలింపు పూర్తయ్యాక బస్సు సర్వీసులు నడపాలని ప్రభుత్వం నిర్ణయిచింది. బస్సు సర్వీసుల అందుబాటుపై 3, 4 రోజుల్లో అధికారికంగా తేదీ ప్రకటించే అవకాశం ఉంది. నిబంధనలు పాటిస్తూ బస్సు సర్వీసులు నడిపేందుకు విధివిధానాలు తయారు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

అంతర్రాష్ట్ర సర్వీసులు ఎలా నడపాలన్నదానిపై కూడా ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. దశాలవారీగా సర్వీసులు పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించింది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నుంచి వచ్చేవారికి బస్సులు నడపడంపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది. బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌ వరకూ సర్వీసులు, మధ్యలో ఎక్కేందుకు అనుమతి లేకుండా నిర్ణయం తీసుకుంది.

బస్సు ఎక్కిన వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలను తీసుకోవాలి. భౌతికదూరం పాటిస్తూ బస్సు సర్వీసులు నడపేలా ఏర్పాట్లు చేయాలి. బస్సులో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. సగం సీట్లు మాత్రమే నింపి బస్సు సర్వీసులు నడపాలి- ముఖ్యమంత్రి జగన్

ఇదీ చదవండి:

'సాయంత్రంలోపు బస్సులు తిప్పే అంశంపై నిర్ణయం'

Last Updated : May 18, 2020, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details