రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తొలగింపు కారణాలపై ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎస్‌ఈసీగా విశ్రాంత జడ్జిని నియమించాలని నిర్ణయించామని హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఆర్డినెన్స్ తెచ్చామని.. మిగతా రాష్ట్రాల ఎస్‌ఈసీల కాలపరిమితి వివరాలు వెల్లడించింది. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని... పోలీసులు, పాలనా యంత్రాంగంపై చేసిన ఆరోపణలు అవాస్తవమని అఫిడవిట్లో ప్రభుత్వం పేర్కొంది. ఎస్‌ఈసీ పదవి నుంచి కావాలనే తప్పించారని వేసిన పిటిషన్ అవాస్తవమని కోర్టుకు తెలిపింది.
సంస్కరణల్లో భాగంగానే నిమ్మగడ్డను తప్పించాం: ప్రభుత్వం
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తొలగింపు కారణాలపై హైకోర్టులో ప్రభుత్వం తుది అఫిడవిట్ దాఖలు చేసింది. ఎన్నికల సంఘం సంస్కరణల్లో భాగంగా కొత్త ఎస్‌ఈసీని నియమించామని హైకోర్టుకు తెలిపింది.
ysrcp govt affidavit submitted in high court about sec issue
Last Updated : Apr 24, 2020, 7:16 PM IST