నవంబరు 2వ తేదీ నుంచి పాఠశాలలు తెరుస్తామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. రెండ్రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. 1, 3, 5, 7 తరగతులకు ఒకరోజు 2, 4, 6, 8 తరగతులకు మరోరోజున తరగతులు నిర్వహించేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు.
నవంబరు 2 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం
నవంబరు 2వ తేదీ నుంచి పాఠశాలలు తెరుస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. నవంబరు నెలలో పాఠశాలల నిర్వహణ ప్రణాళికను సీఎం ప్రకటించారు. 1, 3, 5, 7 తరగతులకు ఒకరోజు 2, 4, 6, 8 తరగతులకు మరోరోజున తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య 750కి మించితే మూడ్రోజులకొకసారి తరగతుల నిర్వహణ అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
సీఎం జగన్
మధ్యాహ్నం వరకు మాత్రమే పాఠశాలలు పనిచేసేలా షెడ్యూలు నిర్ణయించాలని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం అందించి విద్యార్ధులను ఇంటికి పంపాలని సీఎం సూచించారు. నవంబరు నెలలో ఈ ప్రణాళికను అమలు చేయాల్సిందిగా ఆదేశించారు. డిసెంబరు నెలలో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు.
ఇదీ చవదండి :తక్కెళ్ళపాడు గ్రామంలో పూర్తయిన భూముల రీ సర్వే
Last Updated : Oct 20, 2020, 6:42 PM IST