లాక్ డౌన్ నేపథ్యంలో.. రాష్ట్రంలో దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. కంటైన్మెంట్, బఫర్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాల్లో క్రయ విక్రయాలకు అవకాశం కల్పించింది.
పండ్లు, కూరగాయలు, పాల విక్రయాలు ఉదయం 6 నుంచి 11 వరకు నిర్వహించుకోవచ్చని తెలిపింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్‌కు అనుమతి లేదని స్పష్టం చేసింది. వస్త్ర, బంగారు ఆభరణాలు, చెప్పుల దుకాణాలకూ అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.