2021-22 ఏడాదికి జెండర్ బేస్డ్ బడ్జెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలు, శిశు సంక్షేమానికి ఉద్దేశించిన నిధులతో ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మహిళా, శిశు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక బడ్జెట్ రూపొందించనున్నట్లు పేర్కొంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రత్యేక బడ్జెట్ తయారీకి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
2021-22 ఏడాదికి జెండర్ బేస్డ్ బడ్జెట్‌కు ఉత్తర్వులు జారీ - ఏపీలో జెండర్ బేస్డ్ బడ్జెట్

ap govt
17:24 March 08
gender based budget for the year 2021-22
మహిళలు, బాలికలకు వెచ్చించే నిధులు ప్రత్యేక బడ్జెట్ ద్వారా అమలు చేయాలని వివరించింది. మహిళా-శిశు బడ్జెట్ అమలుకు నోడల్ విభాగంగా మహిళా శిశు సంక్షేమశాఖ ఉంటుందని పేర్కొంది.
ఇదీ చదవండి
విశాఖ స్టీల్ ప్లాంటు వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధం లేదు: కేంద్రం
Last Updated : Mar 8, 2021, 5:54 PM IST