మహిళా ఉద్యోగులకు 5 రోజుల అదనపు సీఎల్‌లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత 15 రోజుల సెలవులకు అదనంగా వీటిని అమలు చేయనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐదు అదనపు సీఎల్‌లు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. సీఎం నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా అధ్యాపకులు, లెక్చరర్లకూ అదనపు సీఎల్‌లు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు సాధారణ సెలవులు - ap latest news
ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ప్రస్తుత 15 రోజుల సీఎల్ల(సాధారణ సెలవుల)కు అదనంగా మరో ఐదింటిని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు తీపి కబురు