ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తప్పుడు వార్తలు రాస్తే కేసులే...! - false news pai govt charyalu

నిరాధార కథనాలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా సంబంధింత పబ్లిషర్లు, ఎడిటర్లపై చర్యలు చేపట్టే ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపర చర్యలు తీసుకునేందుకు వివిధ విభాగాల కార్యదర్శులకు అధికారాలు ఇచ్చింది.

నిరాధార కథనాలపై కొరడ... వార్త రాస్తే ఇక కేసులే..!

By

Published : Oct 30, 2019, 8:43 PM IST

Updated : Oct 31, 2019, 1:25 AM IST


నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినా సదరు వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. ఈ మేరకు వివిధ విభాగాల అధికారులకు నిబంధనల కొరడా ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరువు నష్టం కలిగించేలా నిరాధార, దురుద్దేశపూర్వక వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా సదరు పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలతోపాటు, కేసులు పెట్టే అధికారాలు ఇస్తున్నట్లు జీవోలో సమాచార పౌరసంబంధాలశాఖ పేర్కొంది. ప్రజలకు సరైన సమాచారం అందించాలనే ఉద్దేశంతో ఈ ఉత్తర్వులు వెలువరించినట్టు తెలిపింది. దురుద్దేశపూర్వక, నిరాధారమైన వార్తలకు సంబంధిత శాఖల కార్యదర్శులు రిజాయిండర్లు జారీ చేసి, ఫిర్యాదులు చేసేందుకు అధికారాలు కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సంప్రదించి, కేసులు నమోదు చేసేందుకు కార్యదర్శులకు అధికారం ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Last Updated : Oct 31, 2019, 1:25 AM IST

ABOUT THE AUTHOR

...view details