కరోనా మహమ్మారి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రేపట్నుంచి రేషన్ దుకాణాల్లో సరకులు పంపిణీ చేయాలని జేసీలకు ఆదేశించింది. ప్రజలకు సరిపడా రైతుబజార్లు, నిత్యావసర దుకాణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి సరిహద్దుల్లోనే వసతుల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడే వారికే రాష్ట్రంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. క్వారంటైన్ కేంద్రంలో భోజనం, ఇతర సదుపాయాలు ఉంటాయని తెలిపింది. క్వారంటైన్‌లో ఉన్నవారి పర్యవేక్షణకు అధికారి నియమించిన ప్రభుత్వం... ఇతర రాష్ట్రాల్లోని కూలీలు, కార్మికుల బాధ్యత ఐఏఎస్ అధికారికి అప్పగించింది.
రాష్ట్రానికి వస్తున్న వారికి సరిహద్దుల్లోనే వసతి - ఏపీలో కరోనా కేసులు
కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్ వల్ల ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు నివేదిక విడుదల చేసింది.
ap govt on corona