ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మనబడి కార్యక్రమం... విధివిధానాలు ఇవే..! - మనబడి పథక న్యూస్

మనబడి కార్యక్రమం అమలుపై ప్రభుత్వం విధివిధానాలు జారీ చేసింది. వచ్చే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ap govt manabadi Procedures release
ap govt manabadi Procedures release

By

Published : Nov 30, 2019, 4:36 PM IST

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేలా... సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు మనబడి కార్యక్రమం అమలుపై విధివిధానాలు జారీ చేసింది. ప్రణాళికలో భాగంగా 9 అంశాలను పరిగణనలోకి తీసుకొని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. మొత్తం 670 మండలాల్లోని 44 వేల 517 పాఠశాలలు అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మెుదటి దశలో 16 వేల 715 పాఠశాలలు అభివృద్ధి చేయనున్నారు. తల్లిదండ్రుల కమిటీల సమక్షంలో అభివృద్ధి పనులు జరగనున్నాయి. సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో కార్యక్రమం అమలు చేయాలని... ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రెండు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ABOUT THE AUTHOR

...view details