ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎఫ్​ఆర్​బీఎం పెంపుపై ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ప్రభుత్వం

జీఎస్టీ లోటు భర్తీ కోసం రాష్ట్రాల ఎఫ్​ఆర్​బీఎం పరిమితులను పెంచేందుకు కేంద్రం అంగీకరించటంతో..... దానికి అనుగుణంగా ఆర్డినెన్సు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకూ ఉన్న ఎఫ్​ఆర్​బీఎం పరిమితిని 5 శాతానికి తీసుకువెళ్లేలా....... ఆర్డినెన్సు సిద్ధం చేసింది. దీనిపై గవర్నర్ ఆమోదముద్ర కూడా వేసినట్టు తెలుస్తోంది. తద్వారా 20 వేల కోట్ల రూపాయల మేర నిధులను సమీకరించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ap govt
ap govt

By

Published : Sep 1, 2020, 4:52 AM IST

Updated : Sep 1, 2020, 5:00 AM IST

రాష్ట్ర ప్రభుత్వాలు ద్రవ్యలోటు పూడ్చుకునేలా ఎఫ్​ఆర్​బీఎం పరిమితిని పెంచేందుకు కేంద్రం అంగీకరించటంతో రాష్ట్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఎఫ్​ఆర్​బీఎం విషయంలో కేంద్రం ఇచ్చిన వెసులుబాటు వినియోగించుకునేలా కసరత్తు ప్రారంభించింది. ఎఫ్​ఆర్​బీఎం ఐదు శాతం మేర ఉంటే.... 20 వేల కోట్ల మేర రుణం సమీకరించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఆర్థికశాఖ అంచనా వేస్తోంది. 5 శాతం ఎఫ్​ఆర్​బీఎం వినియోగించుకునేందుకు అమలు చేయాల్సిన కేంద్ర నిబంధనలపై.... అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

ఆమోదముద్ర పడగానే....!

పరిమితి పెంపునకు 'వన్ నేషన్-వన్ రేషన్'తో సహా ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల విషయంలో కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను అమలు చేయాల్సి ఉంది. ఈ విషయంలోనూ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మరోవైపు ఎఫ్​ఆర్​బీఎం పరిమితిని పెంచుకునేందుకు అవసరమైన ఆర్డినెన్సును..... ఇప్పటికే ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. దీనిపై ఆయన ఆమోదముద్ర పడగానే రుణ సమీకరణతో పాటు ఆదాయ వనరులు పెంచే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

యూజర్ ఛార్జీల పెంపు..?

ఆదాయ వనరులను పెంచుకుంటే మరిన్ని నిధులు, రుణాలు సమీకరించుకోవచ్చని రాష్ట్ర ఆర్థికశాఖ భావిస్తోంది. విద్యుత్ రంగ సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే విషయాన్ని పరిగణిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల 72 వేల పంపుసెట్ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నిటికీ మీటర్లు బిగించటం ద్వారా విద్యుత్ వినియోగాన్ని గణించనున్నారు. దీంతోపాటు మున్సిపాలిటీల్లోనూ యూజర్ ఛార్జీలు పెంచే అంశాన్నీ ప్రభుత్వం పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయం పెంచుకునే మార్గంలో భాగంగా రవాణాశాఖలోని యూజర్ ఛార్జీలు కూడా సవరించే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ చదవండి

భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ అస్తమయం

Last Updated : Sep 1, 2020, 5:00 AM IST

ABOUT THE AUTHOR

...view details