ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలపై విద్యాశాఖ కసరత్తు! - latest news of ap education dept

ప్రాథమిక పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్వ ప్రాథమిక విద్య(ప్రీ స్కూల్స్‌)ను ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. అందుకు అవసరమయ్యే పాఠ్యాంశాల రూపకల్పనపైనా కరసత్తు చేస్తోంది.

Breaking News

By

Published : May 19, 2020, 8:19 AM IST

ప్రాథమిక పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్వ ప్రాథమిక విద్య(ప్రీ స్కూల్స్‌)ను ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా సమగ్ర శిక్ష అభియాన్‌ కింద 3,400 పాఠశాలల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పూర్వ ప్రాథమిక విద్యకు అవసరమయ్యే పాఠ్యాంశాల రూపకల్పనపైనా కసరత్తు చేస్తున్నారు.

నాలుగున్నరేళ్లు, ఐదేళ్ల పిల్లలకు మొదట పూర్వ ప్రాథమిక విద్యలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇక్కడ ఏడాదిపాటు పఠన, లేఖన నైపుణ్యాలు, గణిత సామర్థ్యాలు వంటివి నేర్పిస్తారు. అనంతరం ఒకటో తరగతిలో చేర్పిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగేందుకు, విద్యార్థులు చదువులో రాణించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. పూర్వప్రాథమిక ఉపాధ్యాయులను ఒప్పంద ప్రతిపాదికన తీసుకుంటారు. మొదట గిరిజన, వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే మొత్తం అన్ని బడుల్లోనూ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details