EMPLOYEES DA: ఉద్యోగుల డీఏ బకాయిలు, పీఆర్సీపై.. సర్కారు ఉత్తర్వులు - EMPLOYEES DA
22:16 January 17
2019 జులై 1 నుంచి 5 డీఏ బకాయిల చెల్లింపునకు ఉత్తర్వులు జారీ
EMPLOYEES DA: 2019 జులై 1 తేదీ నుంచి 5 కరవు భత్యం బకాయిలను చెల్లింపునకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ బకాయిల్లో 2022 జనవరి వేతనం తో కలిపి ఇచ్చే డీఏ కూడా కలిసి ఉన్నట్టు ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. ఈమేరకు ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు ఇచ్చారు. డీఏ బకాయిలు సాధారణ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలోను, సీపీఎస్ ఉద్యోగుల పిఆర్ఏఎన్ ఖాతాలకు జమ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. 2019 జూలై 1 తేదీ నుంచి 2021 డిసెంబరు 31 తేదీ వరకూ ఉన్న 5 డిఏ బకాయిలనూ 2022 జనవరి వేతనంతో చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలియచేసింది.
ఇదీ చదవండి: