ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ డిప్యూటీ తహసీల్దార్​లకు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు

డిప్యూటీ తహసీల్దార్ల(deputy tahsildar)కు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (special executive magistrate ) అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న శాశ్వత భూ హక్కు (YSR Jagananna Shaswata Bhoo Hakku), భూ రక్షా పథకం (Bhu Raksha Scheme) అమలులో వివాదాల పరిష్కారం కోసం నియమించిన డిప్యూటీ తహసీల్దార్​లకు మాత్రమే ఈ అధికారులను ఇచ్చారు.

YSR Jagananna Shaswata Bhoo Hakku
special executive magistrate powers to deputy tahsildar

By

Published : Jun 7, 2021, 3:32 PM IST

జగనన్న శాశ్వత భూ హక్కు (YSR Jagananna Shaswata Bhoo Hakku), భూ రక్షా పథకం (Bhu Raksha Scheme) అమలులో వివాదాల పరిష్కారం కోసం నియమించిన డిప్యూటీ తహసీల్దార్​ల(deputy tahsildar)కు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (special executive magistrate) అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రంలో మండల వారీగా నియమించిన మొబైల్ బృందాల్లోని డిప్యూటీ తహసీల్దార్​లకు ఈ మేజిస్ట్రేట్ అధికారాలను కల్పించారు.

భూముల రీ సర్వే ప్రక్రియలో అప్పటికప్పుడు తలెత్తిన భూ వివాదాల పరిష్కారానికి డిప్యూటీ తహసీల్దార్ నేతృత్వంలో ప్రభుత్వం మొబైల్ బృందాలను నియమించింది. భూముల రీసర్వేలో భాగంగా స్థానికంగా తలెత్తే వివాదాలు ఇరు వర్గాల సమక్షంలో అప్పటికప్పుడే పరిష్కరించేందుకు ఈ మొబైల్ బృందాలు కార్యాచరణ చేపట్టనున్నాయి. రెవెన్యూ చట్టం ప్రకారం ఇప్పటి వరకు తహసీల్దార్​లకు మాత్రమే మేజిస్ట్రిరియల్ అధికారాలు ఉన్నాయి. ప్రస్తుతం భూ సర్వే ప్రక్రియ కోసం డిప్యూటీ తహసీల్దార్ లకు కూడా ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలను ప్రభుత్వం కల్పించింది.

ABOUT THE AUTHOR

...view details