రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ను బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. పంచాయితీరాజ్ , గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్ కు దేవాదాయశాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ - ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ వార్తలు
రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్ధిక శాఖలోని కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం సీఎఫ్ఎంఎస్ సీఈఓ ఎం.ఎన్ .హరేంధిరప్రసాద్‌ను నెల్లూరు జిల్లా రైతు భరోసా, రెవెన్యూ జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఆ మేరకు అంతర్గతంగా సీఎఫ్ఎంఎస్ సీఈఓ నియామకాన్ని చేపట్టాలని ఆర్ధికశాఖకు ప్రభుత్వం సూచించింది. తెనాలి సబ్ కలెక్టర్ గా పని చేస్తున్న కొత్తమాసు దినేష్ కుమార్ ను నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గా బదిలీ చేశారు. ఇక ఇటీవల బిహార్ కేడర్ నుంచి డిప్యుటేషన్ పై ఏపీ కేడర్‌కు బదిలీ అయిన కథవాటే మయూర్ అశోక్ ను తెనాలి సబ్ కలెక్టర్ గా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.