విశాఖలోని మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం కొత్త డీపీఆర్‌ల రూపకల్పన కోసం ప్రతిపాదనల్ని పిలవాల్సిందిగా ఏపీ మెట్రో రైల్ ఎండీని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ సంస్థల నుంచి కొటేషన్లను పిలించేందుకు అమరావతి మెట్రో రైల్ ఎండీకి అనుమతి ఇస్తూ పురపాలకశాఖ ఆదేశాలు ఇచ్చింది. విశాఖ నగరంలో మూడు కారిడార్లలో 79.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నిర్మాణం కోసం ఈ కొత్త డీపీఆర్‌ల రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో డీపీఆర్ రూపకల్పన కోసం ఎస్సెల్ ఇన్ఫ్రా కన్సార్షియంకు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. వీటి కోసం దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, రైట్స్, యూఎంటీసీ తదితర సంస్థలను సంప్రదించాల్సిందిగా సర్కారు ఉత్తర్వుల్లో పేర్కోంది. మూడు కారిడార్లలో మెట్రో రైల్ నిర్మాణం కోసం డీపీఆర్‌ల రూపకల్పనతో పాటు 60 కిలోమీటర్ల మేర అధునాతన ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు మరో డీపీఆర్ సిద్ధం చేసేందుకు అమరావతి మెట్రో రైల్ ఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. ఈ ప్రతిపాదనల్ని పరిశీలించిన ప్రభుత్వం డీపీఆర్‌ల కోసం కొటేషన్లను పిలిచేందుకు అనుమతి మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.
విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం - విశాఖలో మెట్రో రైల్వే నిర్మాణం వార్తలు
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం కొత్త డీపీఆర్ రూపకల్పనకు ప్రతిపాదనలు పిలవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిపాదనల తయారీకి దిల్లీ మెట్రో, రైట్స్, యూఎంటీసీని సంప్రదించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ap govt invite for new DPRs for vishaka metro construction
ఇదీ చదవండి: