ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 4, 2020, 9:47 AM IST

ETV Bharat / city

పెంచిన మద్యం ధరలివే!

రాష్ట్రంలో నేటి నుంచి మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. కేంద్రం మార్గదర్శకాలనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మద్యం విక్రయాలకు అనుమతినిచ్చింది. మద్యం ధరలు 25 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు నేటి నుంచి అమలవుతాయని ఉత్తర్వులు జారీచేసింది.

పెంచిన మద్యం ధరలివే!
పెంచిన మద్యం ధరలివే!

రాష్ట్రంలో నేటి నుంచి మద్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. అదనపు రీటైల్ ఎక్సైజు ట్యాక్సు పేరిట ధరలు పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. భారత్‌లో తయారైన విదేశీ మద్యం, బీర్లు, ఇతర మద్యంపై ధరల పెంపుచూ ఆదేశాలిచ్చింది.

  • 180 ఎంఎల్ రూ.120 వరకు ఉండే వాటిపై రూ.10 నుంచి రూ.240 పెంపు
  • 180 ఎంఎల్ రూ.150 వరకు ఉండే మద్యంపై రూ.20 నుంచి రూ.480 వరకు పెంపు
  • రూ.150 కంటే ఎక్కువ ధర ఉన్న విదేశీ మద్యంపై రూ.30 నుంచి రూ.720 వరకు పెంపు
  • బీర్లు 330 ఎంఎల్‌కు రూ.20 నుంచి 5 లీటర్ల బాటిల్‌కు 3000 వరకు పెంపు

ABOUT THE AUTHOR

...view details