రైతు భరోసా తొలి విడత సొమ్ముతోపాటు 2020 ఖరీఫ్ పంటల బీమా పరిహారాన్ని మే నెలలో ప్రభుత్వం విడుదల చేయనుంది. 2019 పంట రుణాలపై సున్నా వడ్డీ రాయితీని ఏప్రిల్, 2020 ఖరీఫ్ రుణాలపై వడ్డీ రాయితీని ఆగస్టులో జమ చేస్తారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టులో చెల్లిస్తారు. వీటితోపాటు వివిధ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి నవరత్నాల నెలవారీ క్యాలండర్‌ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
వివిధ పథకాల అమలుకు క్యాలెండర్ విడుదల - వైకాపా నవరత్నాలు
నవరత్నాల్లో భాగంగా వివిధ పథకాల అమలుకు క్యాలెండర్ విడుదలైంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నెలల వారీగా సంక్షేమ పథకాల అమలు వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
govt released calendar for implementation of navaratnalu
Last Updated : Apr 13, 2021, 6:57 AM IST