ఆంధ్రప్రదేశ్ భద్రతా కమిషన్‌లో ప్రతిపక్ష నేతకూ చోటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో ప్రతిపక్ష నేతను.. తప్పిస్తూ జారీ చేసిన నిబంధనలను సవరించింది. భద్రతా కమిషన్ ఛైర్మన్‌గా హోం మంత్రి వ్యవహరించనుండగా.. ఇతర సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోంశాఖ కార్యదర్శి ఉంటారు. వివిధ రంగాల్లో సామాజిక సేవలు అందించిన ఐదుగురిని స్వతంత్ర సభ్యులుగా నియమించనున్నారు. వెనకబడిన సామాజికవర్గాల నుంచి ఒకరిని నియమించాలని ప్రభుత్వం నిర్దేశించింది. శాంతిభద్రతలు, పరిపాలన, మానవ హక్కులు, సామాజిక సేవ, ప్రజాపాలన వంటి అంశాల్లో ప్రముఖులను స్వతంత్ర సభ్యులుగా ఏపీ భద్రతా కమిషన్‌లో చేర్చనున్నారు.
రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు - ఏపీ లెటెస్ట్ న్యూస్
రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హోంమంత్రి ఛైర్మన్‌గా, శాసనసభలో ప్రతిపక్షనేత, సీఎస్, హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, మరో ఐదుగురు సభ్యులతో కమిషన్ ఏర్పాటు చేసింది.
Ap govt
Last Updated : Nov 17, 2020, 2:50 AM IST