రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గాల స్థాయిలో 147, జిల్లా స్థాయిలో 13, ప్రాంతీయ స్థాయిలో 4 వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు ఆదేశాల్చించింది. విశాఖ, ఏలూరు, గుంటూరు, తిరుపతి నగరాల్లో 4 ప్రాంతీయ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ల్యాబ్స్ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యత పరిశీలించనున్నారు.
164 వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు ప్రభుత్వ ఉత్తర్వులు - వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ వార్తలు
విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యత పరిశీలన కోసం....రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గం, జిల్లా, ప్రాంతీయ స్థాయిల్లో మొత్తం 164 అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు ఆదేశాలిచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా 164 వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు ఉత్తర్వులు
రూ.197 కోట్లతో ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం నాబార్డుకు సమర్పించింది. నాబార్డు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి(ఆర్‌ఐడీఎఫ్) కింద రూ.150 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది.
ఇదీ చదవండి :కరోనా బాధితుల్ని చేర్చుకోని ఆసుపత్రులపై కఠిన చర్యలు: హోంమంత్రి సుచరిత