ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరోనా పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించండి'

కరోనా అనుమానితుల పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్​ కిట్లు వినియోగించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో పాజిటివ్‌గా తేలితే తక్షణం చికిత్స ప్రారంభించి... రోగిని ఐసోలెట్ చేయాలని స్పష్టం చేసింది.

rapid antigen kits for corona tests
rapid antigen kits for corona tests

By

Published : Jul 13, 2020, 12:00 PM IST

ఆస్పత్రుల్లో కరోనా అడ్మిషన్ల సమయంలో.. కరోనా అనుమానితుల పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలని వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. జిల్లాకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో పాజిటివ్‌గా తేలితే తక్షణం చికిత్స ప్రారంభించి సదరు రోగిని ఐసోలేట్ చేయాలని జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్​వోలకు సూచించింది.

కరోనా లక్షణాలు కలిగి ఈ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారికి మరోసారి రియల్ టైమ్‌లో ఆర్టీపీసీఆర్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైరిస్క్ కేసులు కలిగిన ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో వ్యాధి లక్షణాలు కలిగి.. ఫలితాల్లో నెగిటివ్‌ వచ్చిన వారిని కూడా పరీక్షించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. గర్భిణులు, శస్త్ర చికిత్స చేయాల్సిన రోగులను పరీక్షించేందుకు కూడా ఈ కిట్లు వినియోగించాలని స్పష్టం చేసింది. క్వారంటైన్ కేంద్రాల్లో 10 రోజుల క్వారంటైన్ అనంతరం డిశ్ఛార్జి అవుతున్న వారిని కూడా ఈ కిట్లతో పరీక్షించవచ్చని సూచించింది. అయితే కరోనా లక్షణాలు కలిగి ఉన్న రోగులందరినీ డిశ్ఛార్జి చేసేందుకు ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి అని వైద్యారోగ్యశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details