కరోనా వైరస్ నివారణ చర్యలకు వైద్య ఆరోగ్య శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘ఇన్సిడెంట్ మేనేజిమెంట్ సిస్టమ్’ (ఐఎంఎస్) వేదికగా యాప్‌లు, సహాయ ఫోన్ నెంబర్ల ద్వారా రాష్ట్ర నలుమూలల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. తగిన చర్యలు చేపడుతోంది.
వాట్సాప్ (8297104104) నంబరు ద్వారా...
వాట్సప్ నంబరు ద్వారా సుమారు 5 లక్షల మంది సమాచారాన్ని పొందారు. కరోనా వైరస్ నివారణ చర్యలు, వైరస్ గుర్తింపు లక్షణాలు, ఇతర సమాచారాన్ని తీసుకుంటున్నారు. స్థానికంగా ఉండే ఆరోగ్య సిబ్బంది, క్వారంటైన్ కేంద్రాల వివరాలు, ఆ రోజు వరకు నమోదైన పాజిటివ్ కేసుల వివరాలను తెలుసుకోవచ్చు. ఎంచుకున్న అంశం ఆధారంగా వివరాలు అందుబాటులోకి వస్తాయి.
* ఇదే నంబరుకు ఫోన్ చేసి (ఐవీఆర్‌ఎస్) కరోనాకు వైద్యసేవలు ఏయే ప్రాంతాల్లో లభిస్తాయి? పరీక్షలను ఎక్కడ, ఎలా చేయించుకోవాలి? ఎవర్ని సంప్రదించాలో తెలుసుకోవచ్చు. పారిశుద్ధ్య పరిస్థితులు బాగా లేకున్నా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటివరకు ఈ నంబరుకు 10,814 మంది ఫోన్‌చేశారు.
104..(హెల్ప్ లైన్)కు అన్ని రకాల ఫిర్యాదులు చేయొచ్చు. వైరస్ వ్యాప్తి చెందేలా స్థానికులు ఎవరైనా వ్యవహరిస్తుంటే ఫోన్ చేయవచ్చు. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సమాచారాన్నే కాకుండా ఇతర శాఖల సేవలనూ పొందొచ్చు.