గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కోతకు గురవుతున్న గట్లు, బలహీనంగా ఉన్న ప్రాంతాల పరిశీలన కోసం సాంకేతిక కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి డెల్టా వ్యవస్థ చీఫ్ ఇంజినీర్ కన్వీనర్ గా ఐదురుగు సభ్యులతో కూడిన టెక్నికల్ అడ్వైజరీ కౌన్సిల్ ను ఏర్పాటు చేస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు.
నదీ మార్గం వెంబడి తెగిన గట్లు, బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన పరిష్కారాన్ని తెలియజేయాలని ఉత్తర్వుల్లో పేర్కోంది. ఆరు నెలల్లోగా తమ సిఫార్సులను తెలియజేయాలని సాంకేతిక సలహా మండలికి ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.