ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'స్మార్ట్​ ఫోన్ల రివర్స్ టెండరింగ్​లో రూ.83 కోట్లు ఆదా' - reverse tendering in smart phones news

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అందించే స్మార్డ్ ఫోన్ల రివర్స్ టెండర్లలోనూ రూ.83 కోట్లు ఆదా చేశామని ప్రభుత్వం ప్రకటించింది. రివర్స్ ఆక్షన్​లో తక్కువ ధరకే ఫోన్లు సరఫరా చేస్తామని మరో సంస్థ ముందుకొచ్చిందని తెలిపింది.

Ap govt declared saving of 83 crore in smart phone reverse tendering
'స్మార్ట్​ ఫోన్ల రివర్స్ టెండరింగ్​లో రూ.83 కోట్లు ఆదా'

By

Published : Dec 3, 2019, 9:54 PM IST

స్మార్ట్‌ఫోన్ల రివర్స్ టెండరింగ్‌లో రూ.83 కోట్లు ఆదా చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా... స్మార్ట్​ ఫోన్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 2 లక్షల 64 వేల ఫోన్ల కొనుగోలు టెండర్లలో గతంలో రూ.317 కోట్లకు బిడ్లు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. సోమవారం జరిగిన ఆక్షన్​లో రూ.233 కోట్లకే ఫోన్లు సరఫరా చేసేందుకు ఓ సంస్థ ముందుకొచ్చిందని ప్రభుత్వం తెలిపింది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లలో 26.4 శాతం ప్రజాధనం ఆదా అయ్యిందని ప్రభుత్వం ప్రకటించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details