రేపట్నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లతో సహా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నిరోధంపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను అనుసరించి విద్యాశాఖ, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మార్చి 31 నుంచి పదో తరగతి పరీక్షలు యథాతథంగా జరగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
కరోనా ఎఫెక్ట్ : రాష్ట్రంలో రేపట్నుంచి విద్యాసంస్థలకు సెలవులు
విద్యాసంస్థలకు సెలవులు
17:10 March 18
విద్యాసంస్థలకు సెలవులు
Last Updated : Mar 18, 2020, 6:28 PM IST