విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆర్థిక భారం తగ్గించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌కో, జెన్‌కో ఆస్తులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు బదిలీ చేయాలని ఆదేశాలిచ్చింది. ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్, పీడీసీఎల్ ఆస్తులనూ బదిలీ చేయాలని ఆదేశించింది. ప్రైవేటు బ్యాంకులు, సంస్థల నుంచి అధిక వడ్డీలకు కంపెనీలు రుణాలు తెస్తున్నాయని... వడ్డీభారం తగ్గించుకునేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఆస్తుల బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి వాటి ఆర్థిక వనరులు, వసతుల బాధ్యతను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చూడనుంది.
'ఇకపై ఆ ఆస్తుల బాధ్యత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌దే..!' - govt about electric news
విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆర్థిక భారం తగ్గించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌కో, జెన్‌కో ఆస్తులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ap govt decision on transco