ప్రభుత్వం కీలక నిర్ణయం.. హోదా ఉద్యమ కేసుల ఎత్తివేత - ap govt cases withdraw special categeroy cases
ప్రత్యేక హోదా ఆందోళనల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ap govt cases withdraw special categeroy cases
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో.. రాష్ట్రానికి హోదా కోసం పోరాడి.. కేసులు ఎదుర్కొంటున్న వారికి.. ప్రభుత్వం ఊరట కల్పించింది. గతంలో ఇచ్చిన మాట మేరకు.. వారిపై కేసులు ఎత్తేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక హోదా ఆందోళనల్లో పాల్గొన్నవారిపై నమోదైన కేసులను ఉపసంహరించింది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి కిశోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ సిఫార్సుతో కేసులు ఉపసంహరిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు.