ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త జిల్లాల అధ్యయనంపై సభ్యుల నియామకం - ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వార్తలు

కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం వేగం పెంచుతోంది. జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన రెండో ఉపసంఘంలో సభ్యులను నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

andhrapradesh
andhrapradesh

By

Published : Sep 19, 2020, 1:44 PM IST

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన రెండో ఉపసంఘంలో సభ్యుల్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉపసంఘానికి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి (సర్వీసెస్‌) ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

న్యాయ శాఖ కార్యదర్శి, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌, ఆర్థిక శాఖ నుంచి ఒక ప్రతినిధి, జీఏడీ ఉప కార్యదర్శి (సర్వీసెస్‌) సభ్యులుగా ఉంటారు. వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులు అవసరమైనప్పుడు సమన్వయంతో పనిచేస్తారు.

ABOUT THE AUTHOR

...view details