'జగనన్నఅమ్మ ఒడి' పథకం అమలు కోసం వివిధ శాఖల నుంచి నిధుల విడుదలకు పాలనా అనుమతులు జారీ అయ్యాయి. సామాజిక వర్గాలను అన్నీ కలుపుకొని పథకం అమలుకు రూ. 6 వేల 109 కోట్ల నిధుల విడుదలకు అనుమతి ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో 3లక్షల 80 వేల మంది... బీసీ వర్గాల్లోని 19లక్షల 7వేల 836 మంది... కాపు వర్గంలోని 3లక్షల 79వేల 33మంది లబ్ధిదారులైన తల్లులకు ఈ పథకం వర్తింపచేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2 లక్షల 85వేల 495 మంది ముస్లిం మైనార్టీ, 9 వేల 679 మంది తల్లులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ నెల 9వ తేదీన అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
- బీసీ కార్పొరేషన్ - రూ.3,432 కోట్లు
- కాపు కార్పొరేషన్ - రూ.568 కోట్లు
- మైనారిటీ సంక్షేమశాఖ - రూ.442 కోట్లు
- గిరిజనశాఖ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ - రూ.395 కోట్లు