Governor Met Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం దిల్లీలో కలిశారు. రాష్ట్రంలో రాజకీయ, ఆర్థిక పరిస్థితులను ప్రధానికి వివరించినట్లు సమాచారం. వివిధ రాష్ట్రాలు అప్పులు భారీగా చేస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి ఇటీవల కేంద్ర ప్రభుత్వం వివరాలు కోరిన విషయం విదితమే. ఈ క్రమంలో గవర్నర్ ప్రధానిని కలవడంతో ఆయా అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయని, అలాగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మార్పులనూ వివరించారని తెలిసింది. ఇండియా గేట్ సమీపంలోని యుద్ధ స్మారకం వద్ద ఆదివారం ఉదయం గవర్నర్ నివాళులు అర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సోమవారం భేటీ కానున్నారు.
Governor Met Modi: ప్రధానితో గవర్నర్ భేటీ.. పలు కీలక అంశాలపై ప్రస్తావన! - ప్రధానితో గవర్నర్ భేటీ
Governor Met Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం దిల్లీలో కలిశారు. రాష్ట్రంలో రాజకీయ, ఆర్థిక పరిస్థితులను మోదీకి వివరించినట్లు సమాచారం.
ప్రధానితో గవర్నర్ భేటీ