ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని బిల్లులపై న్యాయ సలహా తీసుకుంటున్న గవర్నర్ - రాజధాని బిల్లులపై న్యాయసలహా కోరిన గవర్నర్

ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపిన రాజధాని బిల్లులపై... రాజ్ భవన్ న్యాయసలహాలు తీసుకుంటుంది. సీనియర్ అడ్వకేట్స్ అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటుంది. ప్రభుత్వం నుంచి బిల్లులు అందగానే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. సీనియర్ న్యాయవాదులు, రాజ్యాంగ నిపుణులతో చర్చించి బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

By

Published : Jul 24, 2020, 4:23 PM IST

ఏపీ రాజధాని బిల్లులపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. సీనియర్ అడ్వకేట్స్ అభిప్రాయాలు, సూచనలు అడిగి తెలుసుకుంటున్నారు. నిన్న, ఇవాళ సీనిఆర్ అడ్వకేట్స్ అభిప్రాయాలు, సూచనలు రాజ్‌భవన్ తెలుసుకుంటుంది. రాష్ట్రప్రభుత్వం నుంచి పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు వివరాలు అందగానే రాజ్‌భవన్ ఈ ప్రక్రియ ప్రారంభించింది.

ఈ బిల్లులను రాష్ట్రపతికి పంపాలని ప్రతిపక్షాలు గవర్నర్ ను విజ్ఞప్తి చేశాయి. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంతో బిల్లులు ముడిపడి ఉన్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. సీనియర్ న్యాయవాదులు, రాజ్యాంగ నిపుణులతో చర్చల అనంతరం బిల్లులపై గవర్నర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదీ చదవండి :కరోనా నియంత్రణ కంటే ఎస్​ఈసీపైనే సీఎం దృష్టి: తెదేపా నేత చినరాజప్ప

ABOUT THE AUTHOR

...view details