కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది (ఆగస్టు 3) జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయించారు. వ్యక్తిగతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాజ్ భవన్‌కు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని...బయటికి వచ్చినా భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన కొవిడ్ నిబంధనలను పాటించటం ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని అన్నారు.
జన్మదిన వేడుకలకు గవర్నర్ దూరం..రాజ్‌భవన్‌కు రావొద్దని విజ్ఞప్తి - ఏపీ గవర్నర్ వార్తలు
ఈ ఏడాది (ఆగస్టు 3) జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయించారు. శుభాకాంక్షలు తెలిపేందుకు రాజ్‌భవన్‌కు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.
ap governor biswa bhusan harichandan