ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్వాతంత్ర సమరయోధులకు గవర్నర్ నివాళులు.. - quit india movement day

క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు స్వాతంత్రోద్యమంలో అశువులు బాసిన స్వాతంత్ర సమరయోధులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులు అర్పించారు. స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా నినాదం.. బ్రిటిష్​ పాలనకు చరమ గీతం పాడిందని గవర్నర్ బిశ్వభూషణ్ వ్యాఖ్యానించారు.

ap governor bishwabhushan on quit India movement
స్వాతంత్ర సమరయోధులకు గవర్నర్ నివాళులు..

By

Published : Aug 9, 2021, 12:33 PM IST

క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు స్వాతంత్రోద్యమంలో అశువులు బాసిన స్వాతంత్ర సమరయోధులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులు అర్పించారు. వారి సాహసం, గుండె ధైర్యం భారత దేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలను ప్రసాదించిందని ట్వీట్ చేశారు. స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా నినాదం.. బ్రిటిష్​ పాలనకు చరమ గీతం పాడిందని గవర్నర్ బిశ్వభూషణ్ వ్యాఖ్యానించారు.

ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు...

మరోవైపు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గిరిజనుల హక్కులను కాపాడేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: VIVEKA MURDER CASE: నేడూ ఆయుధాల కోసం సీబీఐ అన్వేషణ..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details