ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ గవర్నర్​ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు - నూతన సంవత్సరం 2021 వార్తలు

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు రాష్ట్రగవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కొవిడ్ కారణంగా ఈ ఏడాది రాజ్​భవన్​లో కొత్త సంవత్సర వేడుకలు జరపట్లేదు.

Governor NEW YEAR Wishes
ఏపీ గవర్నర్​ను కలిసిన ప్రముఖులు

By

Published : Jan 1, 2021, 4:29 PM IST

నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతున్న కారణంగా ఈ ఏడాది రాజ్ భవన్​లో కొత్త సంవత్సర వేడుకలు జరపకూడదని నిర్ణయించారు. పరిమిత సంఖ్యలో ప్రముఖులు గవర్నర్​ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గమల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్ బాబు, స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ తదితరులు గవర్నర్ దంపతులకు అమ్మవారి ప్రసాదం, వేద ఆశ్వీరచనాలను అందజేశారు.

డీజీపీ గౌతమ్ సవాంగ్, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యాన్నర్, విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు తదితరులు గవర్నర్​కు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సమాచార హక్కు కమిషనర్,సభ్యులతో పాటు తదితరులు గవర్నర్​ను కలిశారు.

ABOUT THE AUTHOR

...view details