ఫిడే ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో రష్యాతో కలిసి సంయుక్తంగా స్వర్ణపతకం సాధించిన భారత జట్టును ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్‌లు అభినందించారు. విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, హరికృష్ణ, దివ్య, నిహాల్, విధిత్‌లు పోటీలో సరైన ఎత్తుగడలు వేసి గొప్ప విజయాన్ని అందించారని సీఎం జగన్ పేర్కొన్నారు. ఫిడే ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించడం గర్వకారణమని...భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ బిశ్వభూషణ్ ఆకాంక్షించారు.
భారత చెస్ జట్టుకు ఏపీ గవర్నర్, సీఎం జగన్ అభినందనలు - ఏపీ సీఎం జగన్ వార్తలు
ఫిడే ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించిన క్రీడాకారులకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్‌లు అభినందనలు తెలిపారు.
భారత చెస్ జట్టుకు ఏపీ గవర్నర్, సీఎం జగన్ అభినందనలు