వైద్యారోగ్య శాఖలోని మౌలిక సదుపాయాల విభాగం బాధ్యతల్ని తితిదే ఈవో కె.ఎస్ జవహర్ రెడ్డి నుంచి ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బదిలీ అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కళాశాలల నిర్మాణం, నాడు-నేడు పనులకు సంబంధించిన వివరాలను ఇప్పటివరకూ జవహర్ రెడ్డి పర్యవేక్షించారు. తాజాగా ఆయన నుంచి వైద్యారోగ్యశాఖ మౌలిక సదుపాయాల విభాగం అదనపు బాధ్యతల్ని ఉపసంహరించుకుంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులిచ్చారు. ఆ బాధ్యతల్ని ఇకపై వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పర్యవేక్షిస్తారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.
తితిదే ఈవో జవహర్‌రెడ్డి నుంచి అదనపు బాధ్యతలు ఉపసంహరణ
తితిదే ఈవో జవహర్‌రెడ్డి నుంచి వైద్యారోగ్యశాఖ మౌలిక సదుపాయాల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ బాధ్యతలను వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్‌కు అప్పగించారు.
ttd eo jawahar reddy