ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలోకి వచ్చేవారికి సడలింపు... ఆటోమేటిక్ ఈ-పాస్​తో ఎంట్రీ

ap epass
ap epass

By

Published : Aug 1, 2020, 10:23 AM IST

Updated : Aug 1, 2020, 12:59 PM IST

10:15 August 01

ఆటోమేటిక్ ఈ-పాస్ జారీకి ప్రభుత్వం నిర్ణయం

కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీలోకి రాకపోకలను సులభతరం చేసినట్టు కొవిడ్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక అధికారి ఎం.టీ. కృష్ణబాబు తెలిపారు. ఏపీలోకి వచ్చే వారంతా స్పందన వెబ్​సైట్​లో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. పేర్ల నమోదు ఆధారంగా ఆటోమేటిక్  ఈ-పాస్ జారీ అవుతుందని తెలిపారు.  కేంద్ర హోం శాఖ జారీ చేసిన అన్ లాక్ 3 మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాల మధ్య రాకపోకలు ఇంకా సులభతరం అయ్యాయని స్పష్టం చేశారు.

ఇక నుంచి ఏపీకి వచ్చే వారికి స్పందన వెబ్ సైట్ ద్వారా ఆటోమేటిక్ ఈ- పాస్ లు జారీ అవుతాయని తెలిపారు. పేరు నమోదు చేస్తే మొబైల్, ఈమెయిల్​లకు వెంటనే ఈ-పాస్ వస్తుందని చెప్పారు. చెక్​పోస్టుల వద్ద ఏదైనా గుర్తింపు పత్రంతోపాటు ఈ పాస్ చూపిస్తే రాష్ట్రంలోకి అనుమతిస్తారని స్పష్టంచేశారు. రాష్ట్రానికి వచ్చే వారిని, వారి ఆరోగ్య పరిస్థితిని గుర్తించేందుకు.. తదుపరి ఆరా తీసేందుకు మాత్రమే స్పందనలో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది తనిఖీలు చేసేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపింది. అయితే ఈ వెసులుబాటు ఆగస్టు 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. 

ఇదీ చదవండి: సీఆర్డీఏ భవితవ్యం ఏమిటో?

Last Updated : Aug 1, 2020, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details