పాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో తదుపరి కార్యచరణపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచుతోంది. మూడు రాజధానుల శంకుస్థాపనకు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమాన్ని ఈనెల 16న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆయన అపాయింట్‌మెంట్ కోరారు. మూడు రాజధానుల శంకుస్థాపనతో పాటు..పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొనాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించాలని భావిస్తున్నారు.
ఈ విషయమై ప్రధాని కార్యాలయ సంయుక్త అధికారి వి.శేషాద్రికి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఇటీవల లేఖ రాసినట్లు తెలిసింది. ఆ లేఖ ప్రతిని ప్రధాని కార్యాలయ ఓఎస్డీ సంజయ్‌కు కూడా పంపారు.
ముహూర్తాలు లేనందునే..!