ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్​ పరిశ్రమలకు ప్రోత్సాహకాల ప్రత్యేక ప్యాకేజీ - ఏపీలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు

కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్​ పరిశ్రమలకు ప్రోత్సాహకాల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెగా ఇండస్ట్రియల్ క్లస్టర్‌లో పరిశ్రమలకు స్టాంపు డ్యూటీని 100 శాతం మినహాయింపునిచ్చారు. ఐదేళ్లపాటు యూనిట్‌ విద్యుత్​కు రూపాయి చొప్పున రీయింబర్సుమెంటు ఉండనుంది. క్లస్టర్​లో 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన భూమిని కేటాయించనున్నారు

special package to koparthi industries
కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్​ పరిశ్రమలకు ప్రోత్సాహకాల ప్రత్యేక ప్యాకేజీ

By

Published : Dec 1, 2020, 2:58 PM IST

Updated : Dec 1, 2020, 3:47 PM IST

కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్​లో ఏర్పాటు కానున్న పరిశ్రమలకు ప్రోత్సాహకాల ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పారిశ్రామిక క్లస్టర్​కు 'వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్​'గా ప్రభుత్వం నామకరణం చేసింది. కొప్పర్తిలో 3155 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మెగా ఇండస్ట్రియల్ హబ్​లో 810 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మొత్తం 25 వేల కోట్ల పెట్టుబడులతో పాటు 2.5 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా కొప్పర్తిలోని ఎలక్ట్రానిక్ మాన్యూఫాక్చరింగ్ క్లస్టర్​లో 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన భూమిని కేటాయించనున్నారు. లీజు కాలాన్ని 99 ఏళ్లకు పెంచుకునేందుకు అవకాశముందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మెగా ఇండస్ట్రియల్ క్లస్టర్​లో ఏర్పాటయ్యే పరిశ్రమలకు స్టాంపు డ్యూటీని 100 శాతం మినహాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఐదేళ్ల పాటు యూనిట్​కు రూపాయి చొప్పున రీఎంబర్సుమెంటు ఉంటుందని స్పష్టం చేశారు. మూల ధన పెట్టుబడులపై రూ.10 కోట్ల వరకూ పెట్టుబడి సబ్సీడీని ప్రభుత్వం ప్రకటించింది. వడ్డీపై 5 శాతం చొప్పున ఏడాదికి రూ.1.5 కోట్ల వరకూ రాయితీని ఐదేళ్లపాటు ఇచ్చేందుకు అంగీకరించింది. మూలధన పెట్టుబడిపై 100 శాతం ఎస్​జీఎస్టీ రీఎంబర్సును ప్రభుత్వం ప్రకటించింది. రవాణాపైనా 25 శాతం వరకూ రాయితీ ఇస్తామని స్పష్టం చేసింది.

Last Updated : Dec 1, 2020, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details