ఇక ప్రభుత్వ భవనాలకు ఆ రంగులే...! - ap Government and Panchayat offices colors
ప్రభుత్వ, పంచాయతీ కార్యాలయాలకు వేసే రంగులపై మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. మట్టి రంగుతో పాటు తెలుపు, నీలం, ఆకుపచ్చని రంగులు వేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ, పంచాయతీ కార్యాలయాలకు వేసే రంగులపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. రంగులు వేసే విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ సూచనల మేరకు... పంచాయతీ భవనాలకు మట్టి రంగుతో పాటు తెలుపు, నీలం, ఆకుపచ్చని రంగులు వేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ సంస్కృతి ప్రతిబింబించేలా 4 రంగులకు అర్థాలు వివరిస్తూ... మట్టిని సూచిస్తూ టెర్రకోట రంగు, పాడి పంటలకు సూచనగా ఆకుపచ్చ, నీలి విప్లవానికి సూచనగా నీలం రంగు, పాల విప్లవానికి సూచనగా తెలుపురంగులు వేయాలని తెలిపింది. ప్రభుత్వ కట్టడాలు, భవనాలకు జాతీయ బిల్డింగ్ కోడ్ మేరకు రంగులు వేయాలని... వాటిపై ఏ రాజకీయ పార్టీ చిహ్నాలు, రంగులు ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రంగును ఎంచుకోవాలని పేర్కొంది.