పాత పింఛన్ అమలుపై ప్రభుత్వం పునరాలోచన.. వివరాలు సేకరిస్తున్న ఆర్థికశాఖ - పాత పింఛన్ అమలుపై ప్రభుత్వం ఆలోచన
19:18 September 13
2004 కు ముందు నోటిఫికేషన్‌లో ఎంపికైన ఉద్యోగులకు పాత పింఛన్‌పై ఆలోచన
OLD PENSION SCHEME : ఉద్యోగులకు పాత పింఛన్ అమలుపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 2004కు ముందు నోటిఫికేషన్‌లో ఎంపికైన ఉద్యోగులకు పాత పింఛన్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. 2004 సెప్టెంబరు 1 నాటికి ఉద్యోగాల్లో చేరినవారికి పింఛన్ వర్తింపజేయడంపై పరిశీలన చేస్తోంది. ప్రభుత్వ శాఖలన్నీ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఆయా శాఖలను ఆర్థిక శాఖ కోరింది.
2004 సెప్టెంబర్ 1 నాటికి విధుల్లో చేరిన ఉద్యోగుల వివరాలు కోరిన ఆర్థిక శాఖ.. ఈ నెల 14న సచివాలయంలో భేటీకి రావాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. 2004 సెప్టెంబర్ 1కి ముందు 6 వేల 510 మంది చేరినట్లు.. పాఠశాల విద్యాశాఖ వివరాలను తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం ద్వారా.. 2003 డీఎస్సీ, కానిస్టేబుళ్లు, 1999 గ్రూప్-2 బ్యాచ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: