ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇసుకపై కీలక నిర్ణయం.. ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు దిశగా ఆలోచన! - ఇసుకపై మంత్రివర్గం నిర్ణయం

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇసుక కోసం కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్‌కు ఎండీ స్థాయి అధికారిని నియమించనున్నారు.

special corporation on sand
special corporation on sand

By

Published : Jul 13, 2020, 7:04 AM IST

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తోంది. ఇసుక కోసం కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్‌కు ఎండీ స్థాయి అధికారిని నియమించనున్నారు.

ఏపీఎండీసీ ఎండీయే దీనికీ ఎండీగా ఉండే అవకాశాలున్నాయి. గనులశాఖ నుంచి జేడీ స్థాయి అధికారి, ఓఎస్‌డీ, ఏపీఎండీసీకి చెందిన కొందరు అధికారులను డిప్యుటేషన్‌పై నియమిస్తారని సమాచారం. నిత్యం ఇసుక తవ్వకాలు, ఆన్‌లైన్‌, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా బుకింగ్‌, జిల్లాల్లో సంయుక్త కలెక్టర్ల అనుమతితో జరుగుతున్న బల్క్‌ బుకింగ్‌ తదితరాలన్నీ ఈ కార్పొరేషన్‌ కిందకు వస్తాయి. కొత్త ఇసుక రీచ్‌లు, స్టాక్‌ పాయింట్ల గుర్తింపునూ ఈ సంస్థ ద్వారానే చేపట్టనున్నారు. ఈ నెల 15న రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరగనుండగా అందులో ఇసుక కార్పొరేషన్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details