రాష్ట్రంలో ఉన్నత విద్య కొత్త రూపు సంతరించుకోనుంది. ప్రస్తుతం డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన చాలామందికి నైపుణ్యాలు లేక ఉద్యోగాలు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో డిగ్రీ, ఇంజినీరింగ్ చదువులను... ఉద్యోగాలు కల్పించేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమై ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. అప్రెంటిషిప్ విధానాన్ని ప్రవేశపెట్టి.. డిగ్రీ విద్యా కాలాన్ని నాలుగేళ్లకు, ఇంజినీరింగ్ విద్యా కాలాన్ని ఐదేళ్లకు పెంచాలని నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు విడుదల చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రవేశాలు తీసుకొనే విద్యార్థులకు మొదటి, రెండో ఏడాదిలో జీవన నైపుణ్యం కోర్సులు ఉంటాయి. చివరి ఏడాది ఆరో సెమిస్టర్‌లో నైపుణ్య కోర్సులు చదవాలి. నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఈ కోర్సులు అమలు చేయనున్నారు.
రుసుముల బాధ్యత ప్రభుత్వానిదే
అప్రెంటిషిప్ సమయంలో విద్యార్థులకు కళాశాలల బోధన రుసుములను ప్రభుత్వం చెల్లిస్తుంది. వసతి, భోజనానికి రూ.20 వేలు అదనంగా ఇస్తారు. ఒకవేళ కంపెనీలు ఉపకార వేతనాలిస్తే మాత్రం.. ప్రభుత్వం ఎలాంటి చెల్లింపులు చేయదు. విద్యార్థులు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. బోధన రుసుములు, వసతి, భోజనం డబ్బులను విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
గుర్తించిన కోర్సులు