పౌరసరఫరాల సంస్థ నగదు రుణ పరిమితి రూ.22 వేల కోట్లకు పెంపు - ఏపీలో పౌరసరఫరాల నగదు రుణపరిమితి పెంపు
రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నగదు రుణపరిమితిని రూ.22 వేల కోట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నగదు రుణపరిమితికి అదనంగా రూ.2 వేల కోట్లు పెంచుతూ జీవో జారీ చేసింది. వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు ప్రభుత్వం హామీ ఇస్తుందని వెల్లడించింది. బ్యాంకుల నుంచి తీసుకునే రుణంపై వడ్డీ 8.5 శాతం దాటకూడదని సర్కారు తెలిపింది.
Civil Supplies funds increased
.