ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతి: భూమిలేని పేదలకు పింఛన్​ విడుదల - AP government latest news

అమరావతి పరిధిలో భూమి లేని పేదలకు ప్రభుత్వం పింఛను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగో విడత కింద మొత్తం 16.25 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

pension
pension

By

Published : Dec 21, 2020, 11:00 PM IST

రాజధాని అమరావతి పరిధిలో భూమిలేని పేదలకు ప్రభుత్వం పింఛను విడుదల చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామల రావు సోమవారం అదేశాలిచారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను నాలుగో విడత పెన్షన్ మొత్తం 16.25 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మొత్తాన్ని భూమి లేని పేదల ఖాతాల్లో జమ చేయాల్సిందిగా అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీ కమిషనర్​ను ప్రభుత్వం ఆదేశించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి పింఛన్ చెల్లింపులకు 65 కోట్ల రూపాయలను బడ్జెట్​లో కేటాయిచారు.

ABOUT THE AUTHOR

...view details