ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రతి శుక్రవారం దోమలపై దండయాత్ర... ఉత్తర్వులు జారీ - ఏపీలో దోమలపై దండయాత్ర వార్తలు

దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజున పరిసరాలు పరిశుభ్రం చేసుకోవాలని ప్రజలకు సూచించింది.

Friday as a dry day
Friday as a dry day

By

Published : Dec 31, 2020, 12:28 PM IST

రోగ కారక దోమల నివారణకు ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రమిత వ్యాధులను నివారించేందుకు డ్రై డేని పాటించాలని ఆదేశిస్తూ వివిధ ప్రభుత్వ శాఖలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పరిశుభ్రత, దోమల నివారణపై ప్రజలకు చైతన్యం కలిగించాలని సూచిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులిచ్చారు. పట్టణీకరణ కారణంగా మురుగు నీటి నిల్వలతో కూడిన ప్రదేశాలు పెరుగుతుండటం దోమల విస్తృతికి కారణమవుతోందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ సమస్యను నివారించేందుకు గ్రామీణ స్థాయిలో పంచాయతీరాజ్, పట్టణాల్లో పురపాలక శాఖ... ప్రజల భాగస్వామ్యంతో కలసి పనిచేయాలని సూచించింది. ఆ రోజున నీటి నిల్వలు ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లు, టైర్లు, వృథాగా పారవేసిన ప్లాస్టిక్ కుండీలు, ఇతర గృహోపకరణాలను శుభ్రం చేసుకోవాలని సూచించింది. క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయం, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు... ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఓ యాప్​ను కూడా సిద్ధం చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details