కార్యనిర్వాహక రాజధాని విశాఖకు తరలింపు విషయంలో శాసనపరమైన ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ ప్రభుత్వం ఎదురు చూస్తుందని, చట్ట ప్రకారం తగిన సమయంలో తదుపరి చర్య తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి(సర్వీసెస్) శశిభూషణ్‌కుమార్ హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు. రాజధాని తరలిస్తున్నారంటూ పిటిషనర్ వ్యక్తంచేస్తున్న ఆందోళనకు ఆధారం లేదన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తగిన ఆదేశాలు జారీచేయాలని కోరారు. కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నానికి తరలించే చర్యలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని ‘అమరావతి పరిరక్షణ సమితి’ కార్యదర్శి గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
శాసన ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ ఎదురు చూస్తాం - amaravathi news
రాజధాని తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. శాసన ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎదురుచూస్తామని తెలిపింది.
ap government